Advertisement

  • స్టార్ హీరో కూతురుపై అత్యాచార బెదిరింపులు

స్టార్ హీరో కూతురుపై అత్యాచార బెదిరింపులు

By: Sankar Tue, 20 Oct 2020 12:17 PM

స్టార్ హీరో కూతురుపై అత్యాచార బెదిరింపులు


శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ పెద్ద లేఖ విడుదల చేశారు.

విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఈ కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్‌లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు.

ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్‌ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవ్వడంతో సదరు నెటిజన్‌ ప్రవర్తనను ఖండిస్తున్నారు

Tags :
|

Advertisement