Advertisement

దళపతి విజయ్ ఫాన్స్ కు దీపావళి గిఫ్ట్ ...

By: Sankar Fri, 13 Nov 2020 12:00 PM

దళపతి విజయ్ ఫాన్స్ కు దీపావళి గిఫ్ట్ ...


దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నాడు. నవంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘మాస్టర్’ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు విజయ్ సేతుపతి, విజయ్ కలిసున్న పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమాను ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ మూవీకి బాణీలు సమకూరుస్తున్నాడు.

కాగా, వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అలాగే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. విజయ్ ఫ్యాన్స్‌ కోరిక మేరకు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు...

Tags :
|
|
|
|

Advertisement