Advertisement

  • దళపతి విజయ్ ప్రతిష్టాత్మక 65 వ చిత్రం పై వచ్చిన క్లారిటీ

దళపతి విజయ్ ప్రతిష్టాత్మక 65 వ చిత్రం పై వచ్చిన క్లారిటీ

By: Sankar Thu, 10 Dec 2020 9:53 PM

దళపతి విజయ్ ప్రతిష్టాత్మక 65 వ చిత్రం పై వచ్చిన క్లారిటీ


తమిళ ఇండస్ట్రీ లో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ సంపాదించిన నటులలో ఒకరు దళపతి విజయ్ ..విజయ్ సినిమా వస్తుంది అంటే తమిళ సినీ వర్గాలలో భారీ అంచనాలు ఉంటాయి ..ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

అయితే ఈ సినిమా తర్వాత విజ‌య్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్న 65వ చిత్రంపై క్లారిటీ వచ్చింది. విజయ్ 65వ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. స‌న్ పిక్చ‌ర్స్ అధినేతి క‌ళానిధి మార‌న్ ఇవాళ విజ‌య్ తో స‌మావేశ‌మ‌య్యారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు.

కళానిధిమార‌న్‌, విజ‌య్‌, నెల్స‌న్ ముగ్గురు స‌మావేశ‌మైన వీడియోను బీఏ రాజు ట్విట‌ర్ లో పోస్ట్ చేశారు. విజ‌య్ 65 ప్రాజెక్టును ఇంట్ర‌డ్యూస్ చేస్తూ రూపొందించిన ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు

Tags :
|
|

Advertisement