Advertisement

ధనుష్ కర్ణన్ షూటింగ్ పూర్తి

By: Sankar Thu, 10 Dec 2020 8:16 PM

ధనుష్ కర్ణన్ షూటింగ్ పూర్తి


తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటులలో ఒకడు హీరో ధనుష్ ..తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర్ణన్‌’ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ విషయాన్ని స్వయంగా ధనుష్ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. డైరెక్టర్‌ మారి సెల్వరాజ్‌తో కలిసి సినిమా సెట్లో ఉన్న ఓ ఫొటో పోస్టు చేసి.. సినిమా షూటింగ్‌ అయిపోందని వెల్లడించాడు.

ఈ సినిమాకు మారి సెల్వరాజ్‌ దర్శకుడు. వీ క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. 1999లో కొడియాంగుళం మణియాచ్చి జాతి ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తుంది.కాగా డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేసిన హీరో ధనుష్, టెక్నిషియన్స్, ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి ధన్యవాదాలు తెలిపాడు

Tags :
|

Advertisement