Advertisement

స్టార్ హీరో అజిత్ కు గాయాలు

By: Sankar Thu, 19 Nov 2020 11:00 PM

స్టార్ హీరో అజిత్ కు గాయాలు


కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ యాక్సిడెంట్ కి గురయ్యారు. షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశంలో బైక్ నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

వెంటనే అలెర్ట్ అయిన చిత్ర యూనిట్ అజిత్ కి షూటింగ్ స్పాట్ లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు. అజిత్ ‘వలిమై’ సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు. దీంతో అజిత్ కొన్ని రోజులు షూటింగ్‌‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. అజిత్ స్వయంగా డూప్ లేకుండా బైక్ చేజ్ స్టంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Tags :
|
|

Advertisement