Advertisement

  • ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న కన్నడ స్టార్ హీరో ..

ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న కన్నడ స్టార్ హీరో ..

By: Sankar Wed, 15 July 2020 2:35 PM

ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న కన్నడ స్టార్ హీరో ..



ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ పేద విద్యార్థుల కోసం ముందుకు వచ్చాడు. సినిమాల ద్వారా స్టార్ హీరో అనిపించుకన్న ఈ నటుడు..ఇపుడు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు.

సుదీప్ స్కూళ్లున్న ప్రాంతాలు, అక్కడున్న వసతులు, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇప్పటికే వాలంటీర్లను ఆయా ప్రాంతాలకు పంపిచాడు. అక్కడున్న సమాచారం మొత్తాన్ని సేకరించాడు. సుదీప్ ఇదంతా చాలా గోప్యంగా చేస్తున్నట్లు సమాచారం..

ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయిన సుదీప్ , కేవలం కన్నడ లోనే మాత్రమే కాకుండా కథ బాగుంటే వేరే భాషల్లో కూడా నటిస్తున్నారు ..తెలుగులో సుదీప్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈగ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే..ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినా సైరా నరసింహారెడ్డి లో కూడా కీలక పాత్ర పోషించాడు ..

Tags :
|
|
|
|

Advertisement