Advertisement

  • టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపిక అయిన ఖైదీ , జెర్సీ సినిమాలు

టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపిక అయిన ఖైదీ , జెర్సీ సినిమాలు

By: Sankar Sat, 01 Aug 2020 4:58 PM

టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపిక అయిన ఖైదీ , జెర్సీ సినిమాలు



కార్తి కథానాయకుడుగా దర్శకుడు లోకేష్‌ కనకరాజన్‌ తెరకెక్కించిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సరికొత్త పంథాకు స్ఫూర్తిగా నిలిచింది. నాయిక, పాటలు లేకుండా కేవలం కథతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అందుకే ఈ థ్రిల్‌ను హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం టోరంటో చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శితం కానుంది.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి, 15 వరకు జ‌ర‌గ‌నుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌లో ఖైదీ చిత్రం ప్ర‌ద‌ర్శించ‌నుండ‌డం గొప్ప విష‌యం అని అంటున్నారు.

ఇక నాని హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ‘జెర్సీ’ చిత్రానికి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. మా చిత్రానికి ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షాహిద్‌ కపూర్‌ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్‌ కానుంది.

కాగా నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ జెర్సీ మూవీ గత ఏడాది మంచి విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ..నాని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి ..క్రికెటర్ గా , ఒక తండ్రిగా , ఒక భర్తగా ఇలా అనేక వేరియేషన్స్లో నాని అద్భుతంగా నటించాడు ..ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీన్ గురించి ఎంత చెప్పిన తక్కువే..

Tags :
|
|
|

Advertisement