త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2'
By: chandrasekar Wed, 09 Dec 2020 11:28 PM
కేజీఎఫ్ మొదటి భాగం ప్రజల
మధ్య ఘన విజయం పొందిన విషయం తెలిసిందే. అందువల్ల రెండవ భాగం తీస్తున్నారు. ఈ
సినిమా ద్వారా కన్నడ సూపర్ స్టార్ యశ్ ఒక్కసారిగా మంచి స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా కన్నడ, తెలుగ, తమిళ
భాషల్లో రిలీజై రికార్డులు బద్దలు కొట్టింది. బంగారు గనుల నేపథ్యంలో సాగే ఈ స్టోరీ
ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాకీ భాయ్‌గా యశ్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాడు.
అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం.ఈ సినిమాకు సీక్వెల్‌గా
కేజీఎఫ్ చాప్టర్ 2 సిద్దమవుతోంది.
కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం
షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్
ప్రముఖ స్టంట్స్ మాస్టర్స్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు
తెలియజేనేసారు. ఈ షెడ్యూల్ లో యష్ మరియు సంజయ్ దత్ లు పాల్గొంటున్నారు. వీరిద్దరి
మద్య జరిగే ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ ఉంటుందని చిత్ర యూనిట్
చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఉండటంతో పాటు చాలా రియాల్టీగా ఉండేలా ప్లాన్
చేశామని డైరెక్టర్ తెలిపారు.
ఇందుకోసం ఈ సినిమా పై
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేటి వరకు సంజయ్ దత్ పై కీలక షాట్స్ షూట్ చేసి
రేపటి నుంచి అసలు పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు.
డిసెంబర్ మూడవ వారం వరకు సినిమా షూటింగ్ పూర్తిచేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల
ముందుకు తీసుకువస్తామని తెలియజేసారు. ఈ సినిమా ప్రేక్షకుల మధ్య మంచి విజయాన్ని
సాదిస్తుందని తెలిపారు.