Advertisement

స‌రికొత్త అవ‌తారంలో కీర్తి సురేష్...!

By: Anji Tue, 29 Sept 2020 11:12 AM

స‌రికొత్త అవ‌తారంలో కీర్తి సురేష్...!

నేను లోకల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన తమిళ్ బ్యూటీ కీర్తి సురేష్.. మహానటి చిత్రంతో ఎన్నో అవార్డ్స్ అందుకున్న ఈ అమ్మడు..ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

రీసెంట్ గా పెంగ్విన్ చిత్రంతో ఓటిటి ప్రేక్షకులను అలరించిన ఈమె..త్వరలో మరో రెండు సినిమాలతో ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే నితిన్ సరసన రంగ్ దే చిత్రంలోనూ నటిస్తుంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే..తాజాగా ఎయిర్ పోర్టులో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించి..అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. వైట్ ప్యాంట్ విత్ బ్లాక్ లైన్స్, బ్లాక్ అండ్ వైట్ టాప్ లో మెరిసి సంద‌డి చేసింది.

క‌ర్లీ హెయిర్ స్టైల్ తో తెలుపు రంగు మాస్క్, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఎయిర్ పోర్టులో నుంచి న‌డిచి వ‌స్తుండ‌గా అక్క‌డున్న కెమెరాలు క్లిక్‌మ‌నిపించాయి. ట్రెండీ వ‌స్త్ర‌ధార‌ణ‌తో న‌యా లుక్ తో ఉన్న కీర్తిసురేశ్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

Tags :

Advertisement