Advertisement

  • కీర్తి ప్రేమ విషయం దాచే ప్ర‌య‌త్నం చేస్తోంది

కీర్తి ప్రేమ విషయం దాచే ప్ర‌య‌త్నం చేస్తోంది

By: chandrasekar Sat, 20 June 2020 4:31 PM

కీర్తి ప్రేమ విషయం దాచే ప్ర‌య‌త్నం చేస్తోంది


కీర్తి సురేష్ పేరు వార్త‌ల్లో ఈమ‌ధ్య బాగా వినిపించింది. కీర్తి ప్రేమ‌లో ప‌డింద‌ని, ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత కుమారుడిని ప్రేమిస్తోంద‌ని, పెద్ద‌లు కూడా వీళ్ల ప్రేమ‌ని అంగీక‌రించి, పెళ్లికి ఒప్పుకున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోంద‌ని ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి.

వీటిపై కీర్తి స్పందించింది. ప్రేమ,పెళ్లి విష‌యాల గురించి ప్రస్తుతం ఆలోచించ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇవ‌న్నీ కేవ‌లం గాసిప్పులే అనుకున్నారు. నిజానికి కీర్తి ప్రేమ క‌థ‌ల్లో వాస్త‌వం లేక‌పోలేద‌ని వార్త వినిపిస్తోంది‌. కీర్తి ప్రేమ‌లో ప‌డింద‌న్న మాట నిజ‌మే అని, ఆ విష‌యాన్ని కీర్తి దాచే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ముందు త‌న చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, అప్పుడు త‌న ప్రేమికుడ్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తోంద‌ని అనుకుంటున్నారు.

నాగ‌చైత‌న్య, స‌మంత ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు కూడా ఈ విష‌యాన్ని చాలా కాలం దాచారు. స‌డ‌న్‌గా ఓ రోజు కుండ బ‌ద్దలు కొట్టారు. కీర్తి కూడా ఇప్పుడు అలానే చేయ‌బోతోంద‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే కొంత కాలం వేచి ఉండాలి.

Tags :
|
|
|

Advertisement