Advertisement

  • ప్రభాస్ , దీపికా కాంబినేషన్ ..ఈ వెయిటింగ్ తట్టుకోలేను అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్

ప్రభాస్ , దీపికా కాంబినేషన్ ..ఈ వెయిటింగ్ తట్టుకోలేను అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్

By: Sankar Tue, 21 July 2020 10:28 AM

ప్రభాస్ , దీపికా కాంబినేషన్ ..ఈ వెయిటింగ్ తట్టుకోలేను అంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్



యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కాంబినేషన్ అనగానే ఒక్కసారిగా ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి ..ఇప్పటికే ప్రభాస్ సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు అలాంటిది దీపికా పదుకొనె కూడా నటిస్తుండటం , ఆ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండటంతో ఆ సినిమా కున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు ...అయితే ప్రభాస్‌తో దీపికా హీరోయిన్ అని తెలియగానే మరో హీరోయిన్ కీర్తి సురేష్ తన ఫీలింగ్స్ బయటపెడుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.

తన ఇన్‌స్టాగ్రమ్‌లో ప్రభాస్- దీపికా జోడీపై తన స్పందన తెలిపిన కీర్తి.. ''ప్రభాస్‌తో దీపికా.. చాలా చాలా పెద్ద వార్త. మరో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించడానికి ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ సెట్టయింది. ఇక ఈ వెయిటింగ్‌ని తట్టుకోలేను'' అంటూ ప్ర‌భాస్ 21పై జనాల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టే కామెంట్ చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్.. మహానటి రూపంలో కీర్తి సురేష్‌కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆమె నటనా ప్రతిభను వెలికితీశారు..

నాగ్ అశ్విన్ ఈ మూవీని పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్నట్లు టాక్. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. ఈ మూవీ ప్రకటన వచ్చిన నాటినుంచే ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇక ఇందులో హీరోయిన్ దీపికా పదుకొనే అని తెలిసి వాళ్లంతా పండగ చేసుకుంటున్నారు

Tags :

Advertisement