Advertisement

ఎట్టకేలకు హీరోయిన్ సంజనకు బెయిల్ మంజూరు

By: Sankar Fri, 11 Dec 2020 9:33 PM

ఎట్టకేలకు హీరోయిన్ సంజనకు బెయిల్ మంజూరు


కర్ణాటకలో డ్రగ్స్ కేసులో జైలు పాలయిన హీరోయిన్ సంజన కు ఎట్టకేలకు బెయిల్ లభించింది..ఈమె డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8 న అరెస్ట్ అయింది...అయితే ఆమె ఎన్ని సార్లు బెయిల్ కి అప్లై చేసిన వివిధ కారణాల వలన తిరస్కరణకు గురి అయింది ..కానీ ఈ సారి మాత్రం ఆమెకు బెయిల్ లభించింది...

కర్ణాటక హైకోర్ట్ బెయిల్‌కు అంగీకస్తూ.. రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుని సమర్పించాలని, కేసులో ఎప్పుడంటే అప్పుడు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని, అలాగే నెలలో రెండు రోజులు కోర్టుకు హాజరై సంతకం చేయాలని షరతులు విధిస్తూ.. సంజనకు హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది. డ్ర‌గ్స్ కేసులో సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. మొత్తం 12మందిపై అభియోగాలు మోపింది.

కాగా బాలీవుడ్ లో సుశాంత్ మరణం తర్వాత ఒక్కసారిగా ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది ..ఆ తర్వాత అది కర్ణాటకలో కూడా వివాదం రేపింది ..ఆలా కర్ణాటకలో సంజన తో పాటు మరొక హీరోయిన్ రాగిణి అరెస్ట్ అయ్యారు..

Tags :
|

Advertisement