Advertisement

  • మరొకసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

మరొకసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

By: Sankar Wed, 12 Aug 2020 7:17 PM

మరొకసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్



పటౌడీ సంస్థానంలోకి మరొక వారసులు రాబోతున్నారు ..ది గ్రేట్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమారుడు అయిన సైఫ్ అలీ ఖాన్ భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు ..ఇప్పటికే ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్ పటౌడి అనే మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు ..

ఈ విషయాన్ని ఈ పటౌడి దంపతులు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మా కుటుంబంలోకి మరో వ్యక్తి చేరబోతున్నారని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు - సైఫ్ అండ్ కరీనా’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా సైఫ్ అలీ ఖాన్ కు కరీనా కపూర్ రెండో భార్య , మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కరీనా ను రెండో పెళ్లి చేసుకున్నాడు ..మొదటి భార్య కూతురు ప్రస్తుతం బాలీవుడ్ అప్కోమింగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ..మరో విశేషం ఏంటి అంటే సారా అలీ ఖాన్ 25వ పుట్టినరోజు (ఆగస్టు 12) నాడే కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీని ప్రకటించడం..ఇక కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో బాబు పుట్టాడు

Tags :
|
|

Advertisement