Advertisement

క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్... గంగ‌వ్వ సేఫ్

By: Anji Sun, 20 Sept 2020 10:20 AM

క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్... గంగ‌వ్వ సేఫ్

బిగ్‌ బాస్ తెలుగు సీజ‌న్ 4లో రెండో వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ వారం నామినేష‌న్స్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో గంగ‌వ్వ‌ను బిగ్‌బాస్ సేఫ్ చేశాడు. ఇక మిగిలిన 8 మంది స‌భ్యుల్లో ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన నాగార్జున.. శనివారం రోజున ఓ నామినేష‌న్ ఉంటుంద‌ని, ఆదివారం ఓ నామినేష‌న్ ఉంటుంద‌ని తెలిపారు.

అందులో భాగంగా క‌రాటే క‌ళ్యాణిని ఎలిమినేట్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్ హౌస్ నుండి సూర్య‌కిర‌ణ్ త‌ర్వాత‌ బ‌య‌ట‌కు వ‌చ్చే కంటెస్టెంట్ క‌ళ్యాణియే. మ‌రి ఆదివారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆదివారం క‌ళ్యాణి స్టేజ్‌పై స‌భ్యుల గురించి మాట్లాడ‌నుంది. ఇంట్లో స‌భ్యులు త‌న‌తో ఎలా ప్ర‌వ‌ర్తించారు? త‌నెందుకు ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్ని క‌ళ్యాణి ఆదివారం రోజున ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌బోతున్నారు.

Tags :

Advertisement