Advertisement

  • అవార్డు ఫంక్షన్లకు వెళ్లేందుకు మంచి డ్రెస్సులు ఉండకపోయేవి ..కంగనా రనౌత్

అవార్డు ఫంక్షన్లకు వెళ్లేందుకు మంచి డ్రెస్సులు ఉండకపోయేవి ..కంగనా రనౌత్

By: Sankar Wed, 24 June 2020 12:27 PM

అవార్డు ఫంక్షన్లకు వెళ్లేందుకు మంచి డ్రెస్సులు ఉండకపోయేవి ..కంగనా రనౌత్



బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఒక్కసారిగా బంధు ప్రీతీ అంశం తెరమీదకి వచ్చింది ..సూపర్ హిట్ సినిమాలు , కావాల్సినంత డబ్బు , సమాజంలో మంచి పేరు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ బాలీవుడ్లో ఉన్న బంధు ప్రీతీ మీద తీవ్ర విమర్శలు చేసారు ..కొంతమంది అయితే బాలీవుడ్ పెద్దల మీద కేసులు కూడా పెట్టారు ..అయితే ఎప్పుడు అన్యాయం జరిగిన వెంటనే స్పందించే నటి కంగనా రనౌత్ కూడా బంధు ప్రీతీ మీద తీవ్ర విమర్శలు చేసింది ..

అయితే తాజాగా కంగనా మాట్లాడుతూ బాలీవుడ్ లో తనకు ఎదురైనా చేదు అనుభవాలని పంచుకుంది ..పరిశ్రమలో తనని గోల్డ్ డిగ్గర్ అనేవారు అని పేర్కొంది ..గోల్డ్ డిగ్గర్ అనగా డబ్బు కోసం పురుషులతో సన్నిహితంగా ఉండటంఅని అనేవాళ్లని బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ అన్నారు. అందుకని 50 ఏళ్ళలోనే ధనవంతుల జాబితాలో చేరి అది తప్పని నిరూపించాలనుకున్నానని కూడా చెప్పారు.అప్పుడు నాపై చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తిరస్కరించాలో అర్థమయ్యేది కాదు. అది నిజం కాదని ఎలా నిరూపించుకోవాలో కూడా నాకు తెలియదు. గౌరవమైన, సాంప్రదాయ నేపథ్యం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ అందరిలాగే గౌరవం, ప్రేమ ఎందుకు దొరకదు. ఎందుకంటే ఇది స్వపక్షపాత భౌతికవాద ప్రపంచం.

అంతేగాక సినిమాలోకి వచ్చిన కొత్తలో ఆవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లేందుకు అప్పుడు నా దగ్గర ఖరీదైన దుస్తులు కూడా లేవు. అలాంటి ఫంక్షన్స్‌కైతే స్టార్‌ కిడ్స్‌కు డిజైనర్స్‌ ఫ్రాక్స్‌ను స్పాన్సర్‌ చేస్తారు. కానీ నేను స్టార్‌కిడ్‌ను కాదు కదా. అప్పుడు గ్యాంగ్‌స్టర్‌ సినిమాకు నాకు అవార్డు వచ్చింది. ఆ సమయంలో ఆ అవార్డు కార్యక్రమానికి వెళ్లేందుకు మంచి డ్రెస్‌ కొనక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా ఫ్రెండ్ డిజైనర్‌‌ రిక్కిరాయ్‌ నాకు డ్రెస్‌ స్పాన్సర్‌ చేశాడు. దాని కోసం అతడు చాలా కష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు అతడికి సాయం చేశారు అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

Tags :
|

Advertisement