Advertisement

  • రామరాజ్యం అంటే ఏంటో నా సినిమాలో చూయిస్తా..కంగనా రనౌత్

రామరాజ్యం అంటే ఏంటో నా సినిమాలో చూయిస్తా..కంగనా రనౌత్

By: Sankar Wed, 05 Aug 2020 8:04 PM

రామరాజ్యం అంటే ఏంటో నా సినిమాలో చూయిస్తా..కంగనా రనౌత్



నేటి అయోద్య చారిత్రత్మాక సంఘటనపై నటి కంగనా రనౌత్‌ స్పందించారు. దేశ చరిత్రలో ఇది ఒక మరపురాని సంఘటన అన్నారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘మందిరం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. అయోధ్య నాగరికతకు ప్రతీక. దీనికి 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది.

మందిరం అంటే కేవలం స్తంభాలు, ఇటుకలతో కూడిన ఓ నిర్మాణం కాదు. ఇది మన నాగరికతను ఉన్నతంగా చూపే ఓ చిహ్నం. రాముడు అంటే దేవుడు కాదు. పురుషోత్తముడు. ఒక మహోన్నత వ్యక్తి. అతడు లేకపోయినా.. ఆయన గుణాలు నేటికి జనాలు పాటిస్తున్నారు. ఈ ఆలయం వాటికి చిహ్నం. రామ రాజ్యాన్ని స్థాపించాడు.. దానిని చాలావరకు మహాత్మా గాంధీ అనుసరించారు. ఆ దారిలోనే మనకు స్వేచ్ఛను సంపాదించారు’ అని తెలిపారు కంగనా..

అయోధ్య రామ మందిరానికి దాదాపు 600 వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని తన మణికర్ణిక బ్యానర్‌లో కంగనా ‘అపరాజిత అయోధ్య’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఇందుకు సంబంధించిన కథను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘నా చిత్రంలో రామ మందిరానికి అనుకూలంగా వ్యవహరించిన ముస్లింలను చూపించబోతున్నాను. ఈ చిత్రంలో దైవం, నమ్మకం అన్నింటికి మించి దేశ ఐక్యతను చూపించబోతున్నాం. కులమతాలకు అతీతమైనది రామ రాజ్యం. అది ఎలా ఉంటుందో మా చిత్రంలో చూపిస్తాం. సినిమాకు సంబంధించిన లోగోను లాంచ్‌ చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్నాం’ అన్నారు కంగనా. అపరాజిత అయోధ్య చిత్రం గురించి ఈ ఏడాది ప్రారంభంలోనే కంగనా ప్రకటన చేశారు.

Tags :
|
|

Advertisement