Advertisement

  • జయంతి సందర్భంగా గురువును స్మరించుకున్న దిగ్గజ నటులు ..

జయంతి సందర్భంగా గురువును స్మరించుకున్న దిగ్గజ నటులు ..

By: Sankar Thu, 09 July 2020 5:51 PM

జయంతి సందర్భంగా గురువును స్మరించుకున్న దిగ్గజ నటులు ..



కే బాలచందర్..కేవలం తమిళ్ పరిశ్రమలోనే గాక సౌత్ ఇండియా మొత్తం లో దిగ్గజ దర్శకులలో ఒకరు ఎన్నో అజరామరమైన సినిమాలను తీశారు ..కేవలం దర్శకుడు గానే గాక ఒక ఇద్దరు దిగ్గజ నటులకు మార్గనిర్దేశకుడిగా కూడా పేరు సంపాదించారు.. వారిలో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్అయితే , మరొకరు విశ్వ నటుడు కమల్ హాసన్ ..అయితే ఈ రోజు బాలచందర్ జయంతి.. ఈ సందర్భంగా ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు తమ గురువుని స్మరించుకున్నారు ..

ముందుగా కమల్ హాసన్ ట్విట్టర్లో బాలచందర్ గురించి ఇలా రాసుకొచ్చారు ..మిస్టర్ కే బాలచందర్. యుక్తవయసులో నేను విన్న కీర్తితో కూడిన పేరు. నా లాంటి నటుడి జీవితంలో అతను చాలా పాత్రలు పోషిస్తాడని ఎవరు అనుకోలేదు. ఆయన నాకు లబ్ధిదారుడు, గురువు, సహకారి, తండ్రి. ఇప్పుడు నేను తన బిడ్డను. భారతీయ సినిమా చరిత్రలో అనిర్వచనీయమైన ఈ వ్యక్తికి నా వందనం" రాశారు.

అదేవిధంగా, రజనీకాంత్ తన వీడియోలో కే బాలచందర్ లేకపోతే తాను నటుడిగా మారలేకపోయేవాడినన్నారు. "ఈ రోజు నా గురువు కేబీ సార్ 90 వ జయంతి. ఆయన నన్ను పరిచయం చేయకపోయినా నేను నటుడిగా మారిపోతాను. విలన్ పాత్రలు, చిన్న పాత్రలు చేయడంలో సంతృప్తి చెందాను. నాకింతగా ప్రజాధరణతోపాటు కీర్తీ , సంపద వచ్చాయంటే ఇవన్నీ కేవలం కేబీ సార్ చలువే" అని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. తనకు రజనీకాంత్ అని పెట్టింది కూడా బాలచందర్ గారే అని చెప్పారు. నన్ను పూర్తి నటుడిగా చేయడమే కాకుండా కోలీవుడ్ కు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. కేబీ సార్ తర్వాతే నా కుటుంబం అని పేర్కొన్నారు.అయితే ఈ దిగ్గజ దర్శకుడు 2014 డిసెంబర్ 23న ఆయన కన్నుమూశారు.


Tags :

Advertisement