Advertisement

హ‌ల్దీ వేడుక‌లో మెరిసిన కాజ‌ల్...

By: chandrasekar Fri, 30 Oct 2020 9:27 PM

హ‌ల్దీ వేడుక‌లో మెరిసిన కాజ‌ల్...


కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ రోజు త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుతో కాజ‌ల్ ఏడ‌డుగులు వేయ‌నుండ‌గా, ఇప్ప‌టికే పెళ్ళికి సంబంధించిన పనులన్నింటిని పూర్తి చేశారు. కాజ‌ల్ ఇంట జరుగుతున్న వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా బుధవారం మెహెందీ ఫంక్షన్‌ నిర్వహించగా.. గురువారం హల్దీ, వేడుకలను నిర్వహించారు. పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్ హ‌ల్దీ వేడుక‌లో మెరిసింది.

ఆమెకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లుకొడుతున్నాయి. తాజాగా హ‌ల్దీ వేడుక‌లో తీసిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక కాజ‌ల్ పెళ్ళి వేడుక‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌న్నింటిని ఆమె సోద‌రి నిషా అగ‌ర్వాల్ చూసుకుంటుంది.

Tags :
|
|

Advertisement