Advertisement

  • ఇంస్టాగ్రామ్ లో కోటిన్నర మంది ఫాలోవర్లను సంపాదించిన కాజల్ అగర్వాల్

ఇంస్టాగ్రామ్ లో కోటిన్నర మంది ఫాలోవర్లను సంపాదించిన కాజల్ అగర్వాల్

By: Sankar Sun, 06 Sept 2020 4:33 PM

ఇంస్టాగ్రామ్ లో కోటిన్నర మంది ఫాలోవర్లను సంపాదించిన కాజల్ అగర్వాల్


టాలీవుడ్ లో గత పదిహేను ఏళ్లుగా అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న నటి కాజల్ అగర్వాల్..నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా , తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత కాలంలో అందరు అగ్ర హీరోలు మరియు యువ హీరోలతో జోడి కట్టింది..

చిరంజీవి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోల నుండి దాదాపు అందరూ కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించింది. తన ఇన్ని ఏళ్ళ కెరియర్ లో ఎన్నో రికార్డులు సాధించిన కాజల్ అగర్వాల్ మరో రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో15 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అంటే కోటిన్నర మంది కాజల్ ను ఫాలో అవుతున్నారన్న మాట. . ఇక మన టాలీవుడ్ మొత్తంలో రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత 15 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంపాదించుకున్న రెండో హీరోయిన్ కాజల్ మాత్రమే.

ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ 'ఇండియన్ 2' మరియు 'హే సినామికా' అనే సినిమాలో నటిస్తోంది.

Tags :
|

Advertisement