Advertisement

  • హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్న ...నువ్వు నా మార్గదర్శివి ..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్న ...నువ్వు నా మార్గదర్శివి ..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

By: Sankar Sun, 05 July 2020 4:32 PM

హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్న ...నువ్వు నా మార్గదర్శివి ..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్



స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా , దివంగత నందమూరి హరి కృష్ణ కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటికీ కేవలం తనకు నచ్చిన కథలతోనే సినిమాలు చేసుకుంటూ , తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్ ..అంత పెద్ద సినిమా ఫామిలీ వెనకాల ఉన్నప్పటికీ ఏ రోజు కూడా స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా కథ నచ్చితే కొత్త దర్శకులకు అవకాశమ్ ఇచ్చిన నటుడు కళ్యాణ్ రామ్ ..అల అవకాశం పొంది ఇప్పుడు తెలుగులో స్టార్ డైరెక్టర్ అయిన వ్యక్తి అనిల్ రావిపూడి ..మంచి కథ దొరికితే కళ్యాణ్ రామ్ ఎలా నటిస్తాడో నిరూపించిన సినిమా పటాస్ ..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ తన విశ్వరూపం చూయించాడు..ప్రస్తుతం తాను హీరోగా సినిమాలు చేయడమే కాకుండా తన తాత గారి పేరు మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వేరే హీరో ల సినిమాలను నిర్మిస్తున్నారు ..

నేడు ఆయ‌న 42 వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న అన్న‌య్య క‌ల్యాణ్ రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. "కొన్ని సంవ‌త్స‌రాలుగా నువ్వు నాకు కేవ‌లం అన్న‌య్య‌గానే కాకుండా నా స్నేహితుడిగా, త‌త్వవేత్తగా‌, దిశా నిర్దేశం చేసే మార్గ‌ద‌ర్శిగా ఉంటున్నావు. హ్యాపీ బ‌ర్త్‌డే క‌ల్యాణ్ అన్నా.. నువ్వు నిజంగా గొప్ప‌వాడివి‌" అంటూ ట్వీట్ చేశారు. ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

1978 జూలై 5న క‌ల్యాణ్ రామ్ జ‌న్మించారు. నంద‌మూరి న‌ట వార‌స‌త్వం పుణికి పుచ్చుకున్న అత‌డు 1989లో "బాల గోపాలుడు" చిత్రంతో బాల‌న‌టుడిగా వెండితెరపై ప్ర‌వేశం చేశారు. అనంత‌రం "తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు.అతనొక్కడే , పటాస్ , లక్ష్మి కళ్యాణ్ వంటి హిట్ సినిమాలలో నటించారు ..అత‌డు చివ‌రిసారిగా 'ఎంత మంచివాడవురా' చిత్రంలో న‌టించాడు. సంక్రాంతి బ‌రిలో దిగిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రు స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం అత‌ను "రావ‌ణ్‌" సినిమాలో న‌టిస్తున్నాడు.

Tags :
|

Advertisement