Advertisement

  • కొందరు అంటే అభిమానం ఉందేమో గాని నేపోటిజం లేదు ..జానీ లీవర్ కూతురు జెమీ

కొందరు అంటే అభిమానం ఉందేమో గాని నేపోటిజం లేదు ..జానీ లీవర్ కూతురు జెమీ

By: Sankar Wed, 08 July 2020 1:09 PM

కొందరు అంటే అభిమానం ఉందేమో గాని నేపోటిజం లేదు ..జానీ లీవర్ కూతురు జెమీ

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్లో ఒక్కసారిగా నేపోటిజం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి..కేవలం నేపోటిజం కారణంగానే సుశాంత్ కు రావాల్సిన సినిమాలు వేరే వాళ్లకు వెళ్లాయని ఆ డిప్రెషన్ తోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని అనేక మంది భావిస్తున్నారు ..సుశాంత్ మరణం తర్వాత ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది ..నేపోటిజం ఉంది అని కొందరు అంటుంటే , అలాంటిది ఏమి లేదు అని మరికొందరు అంటున్నారు ..తాజాగా స్టార్ కమెడియన్ జానీ లీవర్ కూతురు జెమీ కీలక వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో బంధుప్రీతికి ఆస్కారం లేకపోవచ్చని ఆమె అంటోంది. ఐతే కొందరికి కొందరి పట్ల అతి ఇష్టం, అభిమానం ఉండొచ్చేమోనని పేర్కొంది. తానెప్పుడూ ఓ నటుడి కుమార్తెగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చింది జెమీ. ఒక నటుడి కుమార్తెగా, సినిమా రంగంతో అనుబంధం ఉన్న అమ్మాయిగా నా ప్రయాణం గురించి మాట్లాడొచ్చు. చెప్పేందుకు ఇష్టం లేనప్పటికీ బంధుప్రీతి గురించి మీకు చెబుతున్నా. స్టార్‌ కిడ్స్‌ అందరికీ పక్షపాతం వర్తించదు. నటీనటుల పిల్లలందరికీ సినిమా అవకాశం దక్కదు. నా ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. బాలీవుడ్‌లో అతి ఇష్టం వంటిది ఉండొచ్చేమో కానీ బంధుప్రీతి ఉందని అనుకోను' అని జేమీ నెపోటిజంపై తన అభిప్రాయన్ని తెలిపింది.

మిత్రుల పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు. తెలిసిన కొందరిపై అభిమానం ఉండొచ్చు. మా నాన్న నటనను కేవలం వృత్తిగానే భావించారు. జీవితంగా భావించలేదు. షూటింగ్‌కు వెళ్లి మళ్లీ ఇంటికొచ్చి తన నిజ జీవితం గడిపేవారు. తన కుటుంబం, మిత్రులు, ఆధ్యాత్మిక గురించే పట్టించుకొనేవారు. సినిమా స్టార్ల వేడుకలకు వెళ్లేవారు కాదు. మేం ఏ ఒక్క వర్గం వైపో ఉండలేదు. నా తల్లిదండ్రులు ముందు నుంచీ చిత్ర పరిశ్రమకు చెందినవారేమీ కాదు అని జేమీ పేర్కొంది.

Tags :

Advertisement