Advertisement

ఆహా ఓటీటీ యాప్ లో ‘జోహార్’ టీజర్ రిలీజ్

By: chandrasekar Wed, 29 July 2020 8:19 PM

ఆహా ఓటీటీ యాప్ లో ‘జోహార్’ టీజర్ రిలీజ్


కరోనా వేళ ఓటీటీ లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ ఆవు తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా జోహార్ టీజ‌ర్ ను రిలీజ్ చేశాడు టాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ తేజ్‌. కాగా ఆగ‌స్ట్ 14న ‘ఆహా ఓటీటీ యాప్ లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. పొలిటిక‌ల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్‌’ చిత్రం. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాను సందీప్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొద‌టి పోస్ట‌ర్ మంచి టాక్ సొంతం చేసుకుంది.

సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్ర‌శంస‌లు పొందింది జోహార్ చిత్రం. కాగా అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ’ఆహా’ అని పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ‘జోహార్’ చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్‌లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి. కరోనా వేళ ప్రజలు ఎక్కువగా ఓటీటీ లోని సినిమాలను చూస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement