Advertisement

  • Jr. ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు వేసిన జపాన్ జంట ..వైరల్ అవుతున్న వీడియో

Jr. ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు వేసిన జపాన్ జంట ..వైరల్ అవుతున్న వీడియో

By: Sankar Mon, 06 July 2020 3:48 PM

jr. ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు వేసిన జపాన్ జంట ..వైరల్ అవుతున్న వీడియో



యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్సులు వేస్తే అభిమానులు ఎలా ఉగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..ఇండియాలోనే ఉన్న బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్ ఒకరు ..ఎటువంటి స్టెప్ అయినా అవలీలగా అత్యంత స్పీడ్ గా వేయడంలో ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ మాత్రమే సాటి ..ఎన్టీఆర్ పక్కన చేసిన హీరోయిన్లు ఎన్నో సార్లు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు ..అయితే తాజాగా ఎన్టీఆర్ సినిమాలోని ఒక పాటకు జపాన్లోని ఒక జంట అచ్చం ఆ పాటలో ఉన్నట్లే స్టెప్స్ వేయడంతో ఎన్టీఆర్ ఖ్యాతి జపాన్ దాకా పాకింది అని ఎన్టీఆర్ అభిమానులు ఆనంద పడుతున్నారు ..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అశోక్’. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు చాలా బాగుంటాయి. అప్పట్లో ఎన్టీఆర్ లావుగా ఉన్నా డ్యాన్స్ మాత్రం ఇరగదీసేవారు. ఈ సినిమాలోని ‘గోల గోల’ అనే ఫాస్ట్ బీట్ సాంగ్‌కు ఒక జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. అచ్చం ఎన్టీఆర్, సమీరారెడ్డి స్టెప్పులను ఈ జంట దించేసింది. ఈ వీడియోను ఆ జపనీస్ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా మరో హీరో. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.



Tags :
|
|
|
|

Advertisement