Advertisement

చిత్రసీమ వైపే వేలెత్తి చూపడం సరికాదు...

By: chandrasekar Mon, 28 Sept 2020 11:16 AM

చిత్రసీమ వైపే వేలెత్తి చూపడం సరికాదు...


చిత్రసీమ వైపే వేలెత్తి చూపడం సరికాదు. ప్రతిరంగంలోనూ మంచిచెడులుంటాయి అని అభిప్రాయ౦ వ్యక్తం చేసి౦ది అగ్ర కథానాయిక శృతిహాసన్‌. కార్పొరేట్‌ ప్రపంచంలో కూడా మహిళలపై వేధింపులు, వివక్ష ఉంటాయని చెప్పింది. తండ్రి వారసత్వం కారణంగా చిత్రసీమలోకి వచ్చినప్పటికీ తాను కూడా ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొన్నానని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ ‘వ్యక్తిత్వం నచ్చకపోతే ఎంత పెద్ద మనుషులనైనా నేను లెఖ్ఖ చేయను. ముక్కుసూటిగా నా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాను. అలాంటి వారితో మాట్లాడటానికి కూడా ఇష్ట౦ ఉండదు. ఈ ధోరణి వల్ల సినీరంగంలో నేను చాలా అవకాశాలు వదులుకున్నాను. కానీ నేను ఎప్పుడు బాధ పడలేదు. ప్రతి రంగంలో ఇది సర్వసాధారణమే. కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పట్ల నిక్కచ్చిగా వ్యవహరించి ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు చాలా మందే ఉంటారు. కాబట్టి ఒక్క సినీరంగానికి మాత్రమే అవలక్షణాల్ని ఆపాదించవొద్దు. స్వాభావికంగా మనుషుల్లోనే ఆధిపత్యం చెలాయించాలనే వైఖరి ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకొని ముందుకుసాగాలి’ అని తెలిపింది.

Tags :
|

Advertisement