Advertisement

  • శ‌్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం

శ‌్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం

By: chandrasekar Tue, 28 July 2020 1:50 PM

శ‌్ర‌ద్ధాదాస్ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం


తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త సీజ‌న్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్‌లు ఎవ‌రు.. అనే విషయాల్లో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో దీనిపై ప్రచారం పెద్దఎత్తున జరుగుతున్న‌ది. అయితే, బిగ్‌బాస్ సీజ‌న్‌-4 కంటెస్టెంట్‌ల జాబితాలో లేనివారి గురించి కూడా వారు షోలో పాల్గొన‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగుతున్న‌ది. దీంతో పలువురు సెలబ్రిటీలు సోష‌ల్ మీడియాలో వివరణ ఇచ్చుకోవాల్సి వ‌స్తున్న‌ది.

సీజన్‌-4 లో హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఈ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆమె ఆ అస‌త్య ప్ర‌చారంపై స్పందించారు. బిగ్‌బాస్ సీజ‌న్‌-4 కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, తాను అందులో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రద్ధాదాస్‌ ట్విటర్‌లో ఒక‌ పోస్ట్‌ చేశారు. తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొన‌నున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదని ఆమె స్ప‌ష్టంచేశారు.

జ‌ర్న‌లిస్టులు ఇలాంటి వార్త‌లు రాసేముందుకు వాస్తవాలు తెలుసుకోవాల‌ని శ్ర‌ద్ధాదాస్ చెప్పారు. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే తన మొదటి, చివరి హెచ్చరిక అని ఆమె చెప్పారు. ఇకపై త‌న గురించి అస‌త్య‌పు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శ్ర‌ద్ధా హెచ్చరించారు. కాగా, గత సీజన్‌లో కూడా శ్రద్దాదాస్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టనున్నారనే ప్ర‌చారం జోరుగా సాగింది.

Tags :
|

Advertisement