Advertisement

  • ఆత్మ‌వంచ‌న క‌న్నా నిశ్శ‌బ్ధంగా ఉండ‌డం ఉత్తమం: సైఫ్‌

ఆత్మ‌వంచ‌న క‌న్నా నిశ్శ‌బ్ధంగా ఉండ‌డం ఉత్తమం: సైఫ్‌

By: chandrasekar Wed, 17 June 2020 7:20 PM

ఆత్మ‌వంచ‌న క‌న్నా నిశ్శ‌బ్ధంగా ఉండ‌డం ఉత్తమం: సైఫ్‌


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొంద‌రు నెపోటిజం వ‌ల‌న మ‌ర‌ణించాడ‌ని కామెంట్స్ చేస్తున్న నేప‌థ్యంలో సైఫ్ అలీ ఖాన్ తాజాగా స్పందించారు. ఆత్మ‌వంచ‌న క‌న్నా నిశ్శ‌బ్ధంగా ఉండ‌డం ఉత్తమం. కొంద‌రు సానుభూతి కోసం న‌టిస్తున్నారు. సుషాంత్ మ‌ర‌ణాన్ని సొంత లాభాల‌కి వాడుకుంటున్నారు . ఇది స‌రైన ప‌ద్ద‌తి కాదంటూ సైఫ్ మండిప‌డ్డారు. సుశాంత్ మ‌ర‌ణం ఎంతో ఆవేద‌న క‌లిగించింది. కుటంబానికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. సుశాంత్ మ‌ర‌ణించిన వెంట‌నే చాలా మంది స్పందించారు. ఇది నిజంగా ప్రేమ‌తోనే జ‌రిగిందా, లేక రాజ‌కీయ కోణంలోనా అనేది అర్ధం కావ‌డం లేదు. ఇక సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ర‌చ్చ అర్ధ‌ర‌హితంగా ఉంది. దీనిపై కొంత నిశ్శ‌బ్ధం పాటిస్తేనే బాగుంటుంది.

సెల‌బ్రిటీలు ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీగా ఉంటారు. ఇప్పుడేమో కొంద‌రు ఇత‌రుల బాగోగుల ప‌ట్టించుకుంటున్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఇది ఆత్మ‌వంచ‌న‌. అవ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల‌న‌నే సుశాంత్ చ‌నిపోయాడు అన‌డం మంచిది కాదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న వేరే ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడ‌ని సైఫ్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. వాస్త‌వాల‌పై పూర్తి అవ‌గాహ‌క వ‌చ్చాక ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న‌విష‌యాల‌పై స్పందిస్తాను అని సైఫ్ అలీ ఖాన్ అన్నారు. ఇదిలా ఉంటే సైఫ్‌ కుమార్తె సారా అలీఖాన్‌ తన తొలి చిత్రం కేదార్‌నాథ్‌లో సుశాంత్‌తో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement