Advertisement

రానా పెళ్లి ముహూర్తం ఆ రోజేనా ...?

By: Sankar Sun, 31 May 2020 7:07 PM

రానా పెళ్లి ముహూర్తం ఆ రోజేనా ...?

నిన్న మొన్నటి వరకు నో పెళ్లి అంటూ పాటలు పాడిన టాలీవుడ్ భల్లాలదేవ రానా , అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తన స్నేహితురాలు అయిన మిహిక బజాజ్ ను ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ..దీనితో అందరూ ఆశ్చర్యం తో పాటు ఆనందాన్ని వ్యక్తం చేసారు ..

ఇప్ప‌టికే రామానాయుడు స్టూడియోలో రోకా ఫంక్ష‌న్‌తో పెళ్లి ప‌నులు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా కార‌ణంగా ఇప్ప‌ట్లో పెళ్లి తంతు పెట్టుకోరు, డిసెంబ‌ర్‌లో వివాహం జ‌రుగుతుండొచ్చు అని అంద‌రూ భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రానా తండ్రి ద‌గ్గుబాటి సురేష్ బాబు ఆగ‌స్టులోనే పెళ్లి చేసేయాల‌నుకుంటున్నార‌ట‌.

rana,mihika bazaz,marriage,love,daggubati

ఆగ‌స్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉంద‌ని, ఆ రోజే ఈ ప్రేమ‌ప‌క్షుల‌ను పెళ్లి బంధంతో క‌లిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం. హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాలు మాత్ర‌మే హాజ‌ర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక క‌రోనా వ‌చ్చినా, ఇంకేదైనా ప్ర‌ళ‌య‌మే వ‌చ్చినా పెళ్లి ఆగేదే లేద‌ని నిఖిల్ త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వికి మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడైన విష‌యం తెలిసిందే. దీంతో రానా కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హీరో నితిన్ మాత్రం నిశ్చితార్థం జ‌రిగినా పెళ్లిని వాయిదా వేస్తూ ఇంకా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాడు.


Tags :
|
|

Advertisement