Advertisement

  • విలక్షణ నటుడు విక్రమ్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో భారత మాజీ స్టార్ బౌలర్

విలక్షణ నటుడు విక్రమ్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో భారత మాజీ స్టార్ బౌలర్

By: Sankar Thu, 30 July 2020 5:00 PM

విలక్షణ నటుడు విక్రమ్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో భారత మాజీ స్టార్ బౌలర్



టీమిండియా ఒకప్పటి స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు ..బౌలర్ గా టీమిండియాకు ఎన్నో మధురమైన విజయాలను అందించి ఇండియన్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడిగా నిలిచిన ఇర్ఫాన్ తాజాగా నటుడిగా కూడా రాణించాలని ఆరాటపడుతున్నాడు ..

విలక్షణ నటుడు విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం 25 శాతం షూటింగ్ పూర్తి కాగా, క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డింది. ఇర్ఫాన్ కూడా చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు..తాజాగా విక్ర‌మ్ .. కొల్‌కత్తాలో జరిగిన ‘కోబ్రా’ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో దిగిన ఫోటోస్‌ని షేర్ చేసాడు. చిత్రంలో తాను ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. ఇర్ఫాన్ లుక్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

కోబ్రా చిత్రంలో విక్ర‌మ్ అనేక గెట‌ప్స్‌లో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా త‌న తొలి చిత్రంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాల‌ని భావిస్తున్నాడు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘కోబ్రా’ చిత్రం కి ఏఆర్‌ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే భార‌త క్రికెట‌ర్ ..హర్భజన్‌సింగ్ కూడా‌ ‘ఫ్రెండ్‌షిప్‌’, ‘టిక్కీలోనా’ తదితర చిత్రాల‌తో న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతున్నాడు.



Tags :
|
|

Advertisement