Advertisement

  • 'వెన్నెల'లో గోడ మీద కూర్చొని పాటలు వింటున్న రాజశేఖర్ పెద్ద కూతురు

'వెన్నెల'లో గోడ మీద కూర్చొని పాటలు వింటున్న రాజశేఖర్ పెద్ద కూతురు

By: Sankar Wed, 01 July 2020 5:50 PM

'వెన్నెల'లో గోడ మీద కూర్చొని పాటలు వింటున్న రాజశేఖర్ పెద్ద కూతురు



సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద అమ్మాయి శివాని హీరోయిన్ గా , ఇంద్ర సినిమాలో చిన్న మెగాస్టార్ గా అభిమానులను అలరించిన తేజ హీరోగా ఒక సినిమా ప్రారంభం అయింది ..ఒక ఫాంటసీ లవ్ స్టోరీలో వెన్నెల అనే క్యూట్ రోల్‌ ద్వారా శివానీ రాజ‌శేఖ‌ర్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు...ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు ..ఇప్పటికే రాజశేఖర్ చిన్న కూతురు దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటించింది..

బుధవారం శివాని పుట్టినరోజు సందర్భాన్ని పుర‌స్కరించుకొని సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్టర్ ప‌రిచ‌య పోస్టర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. శివాని ఈ పోస్టర్‌లో మ‌న ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెల‌వంక‌ను చూపిస్తోన్న ఆమె.. అపురూప లావ‌ణ్యంతో మెరిసిపోతున్నారు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏవో వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గట్లుగా ఆమె క‌నిపిస్తున్నారు.

బాల‌న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించి, సూప‌ర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్టర్‌గా ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా.. ఈ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మూడు సీజ‌న్లు ర‌న్ అయిన ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న మ‌ల్లిక్ రామ్ ద‌ర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇప్పటికే చిన్న కూతురు దొరసాని సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది ..ఇపుడు ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే పెద్దమ్మాయి కూడా అదరగొట్టెలానే కనిపిస్తుంది

Tags :
|

Advertisement