Advertisement

  • నాని నటించిన సినిమా 'V' ద్వారా అరుదైన రికార్డుల్లోకి

నాని నటించిన సినిమా 'V' ద్వారా అరుదైన రికార్డుల్లోకి

By: chandrasekar Sat, 05 Sept 2020 09:57 AM

నాని నటించిన సినిమా 'V' ద్వారా అరుదైన రికార్డుల్లోకి


కరోనా వల్ల థియేటర్లు మూసివేయడంతో సినిమాలన్నీ ఇప్పుడు ఓటిటిలో విడుదల చేస్తున్నారు. మామూలు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఓటిటిలో విడుదల కావడంతో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమా ద్వారా న్యాచులర్ స్టార్ నాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈయన తాజా సినిమా వి నేరుగా ఓటిటిలో విడుదల చేశారు. అక్కడే స్ట్రీమ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. తెలుగులో ఓటిటిలో విడుదలవుతున్న తొలి క్రేజీ సినిమా ఇదే. ఇప్పటి వరకు అన్నీ చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఈ మాములు బడ్జెట్ సినిమా ఓటిటిలో విడుదలవడంతో నాని తర్వాత మిగిలిన హీరోలు కూడా క్యూ కడతారని అంతా ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే నాని మాత్రం ఇప్పుడు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

నాని నటించిన 25వ సినిమా థియేటర్స్‌లో కాకుండా హోమ్ థియేటర్స్‌లో విడుదలవుతుంది. నాని తన 25వ సినిమాను తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటితోనే చేసాడు. అది కూడా విలన్‌గా నటించాడు. ఇలాంటి క్రేజీ సినిమాను థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని చాలా ఆశ పడ్డాడు. కానీ చివరికి కరోనా కారణంగా ఇంట్లోనే చూడాల్సి వస్తుంది. బహుశా ఏ హీరో కూడా తన ల్యాండ్ మార్క్ సినిమాను థియేటర్ కాకుండా ఇంట్లోనే చూసుకుని ఉండడేమో. అందరు హీరోల ల్యాండ్ మార్క్ సినిమాలు థియేటర్స్‌లో వస్తే నాని మాత్రం తన సినిమాను ఇంట్లోనే చూసుకోండి అంటున్నాడు. ఈ అరుదైన రికార్డ్ ఈయనకు తప్ప మరే హీరోకు సాధ్యం కాదేమో కానీ ఇలాంటి వింత రికార్డులు మాత్రం ఏ హీరో కూడా కావాలని కోరుకోడు. ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించడం వల్ల అభిమానుల మధ్య ఒక క్రేజ్ సంపాదించింది.

Tags :
|
|

Advertisement