Advertisement

  • దేశంకోసం ప్రాణాలు అర్పించే సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ !

దేశంకోసం ప్రాణాలు అర్పించే సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ !

By: Sankar Wed, 16 Dec 2020 11:05 AM

దేశంకోసం ప్రాణాలు అర్పించే సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ !


టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో విజయ్ దేవరకొండ ఎవరు ...అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి గా టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఈ రౌడీ హీరో ..ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు..

ఇక ప్రస్తుతం డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు..ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి... అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవుతున్నారు.

పూరి సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో విజయ్‌ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారత్, పాకీస్తాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని సైనికుడిగా కనిపించనున్నాడని టాక్ వస్తుంది.

Tags :

Advertisement