Advertisement

  • "ఇమేజ్" అదో బిగ్ ట్రాప్ అంటున్న మెగా బ్రదర్ నాగబాబు

"ఇమేజ్" అదో బిగ్ ట్రాప్ అంటున్న మెగా బ్రదర్ నాగబాబు

By: chandrasekar Sat, 04 July 2020 1:33 PM

"ఇమేజ్" అదో బిగ్ ట్రాప్ అంటున్న మెగా బ్రదర్ నాగబాబు


అసలు ఇమేజ్ అంటే ఏమిటి? అదో బిగ్ ట్రాప్ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. మంచివాడు అనిపించుకునే ఇమేజ్ కంటే వెధవ అని అనిపించుకునే ఇమేజే గొప్పది అంటున్నారు నాగబాబు. మన ఛానల్ మన ఇష్టం అంటూ తనకు నచ్చిన, వచ్చిన సబ్జెట్స్‌పై యూట్యూబ్‌ లో మాట్లాడుతున్న నాగబాబు. ఈసారి ‘ఇమేజ్’పై పేద్ద ప్రసంగం ఇచ్చారు.

‘ఇమేజ్ అంటే బిగ్ ట్రాప్ అదెలా అంటే మనల్ని ఒక చట్రంలో అమర్చేసి మనల్ని అవి దాటి వెళ్ల కుండా ఈ సమాజం చేయడమే ఇమేజ్ ఇదో బిగ్ ట్రాప్. జైలు లాంటిది ఇమేజ్. ఐ హేట్ ఇమేజ్. నాకు ఇమేజ్ అనే మాటే అసహ్యం. ఆ పదాన్ని నేను లైక్ చేయను. లెక్క చేయను. మనిషికి ఇమేజ్ ఉన్నా లేకపోయినా బతుకేస్తాడు.

ఇమేజ్ అనేది బంధించే జైలు లాంటిది. ఒకసారి ఇమేజ్ వచ్చిన తరువాత మన బతుకు మనం బతకడం మానేస్తాం. ఎలాంటి ఇమేజ్‌ని అయితే సమాజం ఇచ్చిందో దాన్ని కాపాడుకోవడంతోనే జీవితం అయిపోతుంది. ఇమేజ్ తప్ప వేరే బతుకు కనిపించదు. నువ్ ఎలా ఉన్నా ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్నావంటే వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని వాళ్లే చెప్పేస్తారు. నిజానికి నువ్ అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇలాంటి ఇమేజ్‌లో బతకడం అనేది మనషికి నరకం లాంటిది. ఇలాంటి ఇమేజ్‌లలోనూ చాలా రకాలు ఉన్నాయి.

చాలా గొప్పోడని మహాజ్ఞానిఅని మహానుభావుడని ఇలా సమాజం కొన్ని బిరుదులు ఇస్తుంది. వాటిని కాపాడుకోవడం కోసం మన లోపల ఇంకొడు ఉన్నా బయటకు ఒకలా ఉండాల్సి వస్తుంది. పైకి చాలా డీసెంట్‌గా కనిపిస్తూ ఇమేజ్‌ని కాపాడుకుంటాడు. కాని వాడి అసలు రూపం అది కాదు. ఇమేజ్ కోసమే అలా చేస్తాడు. ఇమేజ్ అనేది చాలా డేంజర్. ఇంకా చెప్పాలంటే మంచివాడు, మహానుభావుడు అనే ఇమేజ్ కంటే వెధవ, సన్నాసి, పనికిమాలిన వాడు అనే ఇమేజ్ చాలా బెటర్. ఎందుకంటే ఇలాంటి ఇమేజ్ ఉన్నోడిని ఎవరూ ఏమీ అనరు. పట్టించుకోరు. మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా బతకాలి.. మంచి పేరు ఇమేజ్ సంపాదించాలనేది పరమ నరకం లాంటిది. ఇది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ పెట్టనమ్మ ఎలాగూ పెట్టలేదు ఎప్పుడూ పెట్టే 'దీనికి ఏమైంది? అని అడుక్కుతినేవాడి సామెతను ఇక్కడ గుర్తు చేసుకోవాలి’ అంటూ ఇమేజ్ గురించి ప్రసంగం చేశారు నాగబాబు.

Tags :
|
|

Advertisement