Advertisement

  • లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవ చేసిన వారిలో అగ్రస్థానం దక్కించుకున్న సోను సూద్

లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవ చేసిన వారిలో అగ్రస్థానం దక్కించుకున్న సోను సూద్

By: Sankar Mon, 06 July 2020 09:58 AM

లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవ చేసిన వారిలో అగ్రస్థానం దక్కించుకున్న సోను సూద్



కరోనా మహమ్మారి వలన దేశం మొత్తం లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .ఎక్కెడెక్కడో పనుల కోసం తమ సొంత ప్రాంతాలను వదిలి వెళ్లిన కూలీలు అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో ఎటు పోలేని పరిస్థుతుల్లో , చేతుల్లో డబ్బులు లేక , చేయడానికి పని లేక అనేక అవస్థలు పడ్డారు ..అయితే ఈ కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది సెలెబ్రిటీలు తమకు తోచినంత సాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చారు ..

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో సేవలు చేసిన ప్రముఖుల పనితీరుపై ఓ సర్వే నిర్వహించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ). ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు సోనూసూద్. ఆ తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ ఉండటం గమనార్హం.

అయితే లాక్ డౌన్ సమయంలో సోను సూద్ ఎన్నో సామజిక కార్యక్రమాలను చేపట్టాడు ..ముఖ్యంగా వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు చేర్చడం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు ..అలాగె తనకు ఉన్న హోటల్ ను కూడా కరోనా నిర్మునలకు పోరాడుతున్న సిబ్బంది ఉండటానికి ఇచ్చాడు సుమరు 30,000 పైచిలుక వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చారు సోనూసూద్...ఇప్పటికి కూడా సోను సూద్ తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు ..ఆపత్కాలంలో అవసరం ఉన్నవారికి అండగా ఉన్నందుకు ప్రజలందరి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు

Tags :
|
|

Advertisement