Advertisement

  • మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్నాను ..శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్నాను ..శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Sun, 07 June 2020 07:54 AM

మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్నాను ..శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు


రెండు , మూడు సంవత్సరాల క్రితం వరకు తెలుగు లో అగ్ర హీరోయిన్ లలో ఒకరుగా ఉన్న నటి శృతి హాసన్ ..కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతో ఇండస్ట్రీ లో అగ్ర తారల్లో ఒకరిగా నిలిచింది..అయితే గత కొద్దీ కాలంగా శృతి హాసన్ సినిమాలు ఏమి చేయడం లేదు..అయితే తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయకిగా బిజీగా ఉన్నారు. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇటీవల ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.


shruthi hasan,kamal hasan,heroine,tollywood,telugu ,తెలుగు,  అగ్ర హీరోయిన్, శృతి , కమల్ హాసన్, లాక్‌డౌన్‌, మానసిక సమస్య

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతుందన్నారు. ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి అన్నారు. ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అందులో ఒకటి మానసిక సమస్యగా పేర్కొన్నారు. ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు అన్నారు.

సాధారణంగా ప్రజలు హెచ్చరికగానే ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం బయటకు చెప్పటానికి సంతోషిస్తున్నారన్నారు. తాను కూడా మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అని తెలిపారు. తాను నిత్యం క్రమం తప్పకుడా వీటిని పాటిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా సంగీతాన్ని వినడం, పుస్తక పఠనం, రాయడం వంటివి చేసుకుంటానని తెలిపారు.


Tags :

Advertisement