Advertisement

  • స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టే ఎవరు నాతో మిస్ బిహేవ్ చేయలేదు: అనుష్క

స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టే ఎవరు నాతో మిస్ బిహేవ్ చేయలేదు: అనుష్క

By: chandrasekar Mon, 24 Aug 2020 4:48 PM

స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టే ఎవరు నాతో మిస్ బిహేవ్ చేయలేదు: అనుష్క


కాస్టింగ్ కౌచ్ బారిన ప‌డ్డ భామ‌లు నిర్భ‌యంగా బ‌య‌ట‌కి వ‌చ్చి నిజ‌నిజాల‌ని బ‌య‌ట ‌పెడుతున్నారు. గ‌తంలో టాలీవుడ్ జేజెమ్మ అనుష్క కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తాను ఇండ‌స్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన ప‌డ్డాన‌ని పేర్కొంది. సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌నే విష‌యం అందరికి తెలిసిన విష‌య‌మే, ఇందులో సీక్రెట్ ఏమి లేదు. నేను కూడా కాస్టింగ్ కౌచ్ వ‌ల‌న ఇబ్బందులకు గురైయ్యాను.

ముక్కుసూటిత‌నం, ధైర్యంగా ఉండ‌డం వ‌ల‌న త‌ప్పించుకోగ‌లిగాను. స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా ఉంటాను. కాబ‌ట్టే ఎవ‌రు నాతో మిస్ బిహేవ్ చేయ‌లేదు అని తెలిపింది అనుష్క‌. నిశ్శ‌బ్ధం సినిమా ప్ర‌మోషన్‌లోను అనుష్క కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. కొత్త‌గా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆమె పేర్కొంది. ఇండ‌స్ట్రీలో ఇలాంటి వాటికి లొంగ‌కుండా ఎక్కువ కాలం ఉండేందుకు క‌ష్ట‌మైన మార్గాన్ని ఎంచుకున్నాన‌ని త‌న ప్ర‌యాణం గురించి చెప్పుకొచ్చింది అనుష్క శెట్టి.

Tags :
|

Advertisement