Advertisement

  • త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను

త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను

By: Anji Sat, 29 Aug 2020 7:14 PM

త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను

టాలీవుడ్‌ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

ఇంకా నిన్నటినుంచే అభిమానులు, సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ‘‘అంతులేని ప్రేమ, అభిమానం చూపిస్తున్న సీనియర్‌, జూనియర్‌ అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ మిత్రులతో పాటు ఇతర మిత్రులందరికీ నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

ట్విటర్‌లో ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘ ఇవాళ నా 31వ పుట్టిన రోజు. నిన్నటి నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 5 నెలల తర్వాత పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను. బిగ్‌బాస్‌ సీజన్‌ 3ని విజయవంతం చేసినట్లే సీజన్‌ 4ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ నని అన్నారు.

https://twitter.com/iamnagarjuna/status/1299656079907856385?

Tags :

Advertisement