Advertisement

  • అడవిని దత్తత తీసుకుంటా ..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

అడవిని దత్తత తీసుకుంటా ..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

By: Sankar Thu, 11 June 2020 8:28 PM

అడవిని దత్తత తీసుకుంటా ..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

పుడ‌మి ప‌చ్చ‌గుండాలె- మ‌న బ‌తుకులు చ‌ల్ల‌గుండాలె" అనే నినాదంతో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో ద‌శ‌కు చేరుకుంది. ఈసారి డార్లింగ్‌ ప్ర‌భాస్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాడు. ఎంపీ సంతోష్ కుమార్‌తో క‌లిసి త‌న నివాసంలో మూడు మొక్క‌లు నాటి ఛాలెంజ్‌ను స్వీకరించాడు. అభిమానులు కూడా మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చాడు. అనంత‌రం ఎంపీతో క‌లిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్ర‌కృతిపై ఉన్న ప్రేమ‌తో సంతోష్ కుమార్‌ అడ‌విని దత్త‌త తీసుకుని అభివృద్ధి చేప‌ట్టిన విష‌యంపై ప్ర‌భాస్ ఆస‌క్తి క‌నబ‌ర్చాడు

తాను కూడా రాష్ట్రంలో వెయ్యి ఎక‌రాలు ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్‌ను ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించారు. అనంత‌రం ఈ చాలెంజ్ స్వీక‌రించేందుకు ద‌గ్గుబాటి రానా, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్‌ను నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపాడు. అయితే బాహుబ‌లి మాస్కు ధ‌రించే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. కాగా ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగా విస్త‌రిస్తుందో, ఎవరెవ‌రు ఛాలెంజ్‌లు విసురుకుంటారో చూడాల్సిందే.

Tags :
|
|

Advertisement