Advertisement

  • ”కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను’ అని కామెంట్ పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌

”కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను’ అని కామెంట్ పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌

By: chandrasekar Sat, 25 July 2020 3:35 PM

”కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను’ అని కామెంట్ పెట్టిన  రామ్ చ‌ర‌ణ్‌


వ‌ర్మ గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌ర్ స్టార్ సినిమాతో హాట్ టాపిక్‌గా మారాడు. ప‌వ‌న్ పోలిక‌ల‌తో ఉన్న వ్య‌క్తిని ప‌ట్టుకొని ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా చేశాడు. ఈ సినిమాకి సంబంధించి వ‌రుస పోస్ట‌ర్స్ రిలీజ్ చేస్తూ వ‌స్తున్న ఆయ‌న రీసెంట్‌గా ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశాడు. ఈ ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ పాత్ర‌ని సెటైరిక‌ల్‌గా చూపించారని భావించిన అభిమానులు వ‌ర్మ ఆఫీస్‌పై దాడి చేశారు. పోలీసుల చొర‌వ‌తో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి.

ప్ర‌తి రోజు ఏదో విష‌యంపై చిచ్చు రాజేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కే రాంగోపాల్ వర్మ, ఫై ప‌వ‌ర్ స్టార్ సినిమా మూవీపై నిర్మాత అల్లు అర‌వింద్ కూడా మండిప‌డ్డాడు. వ‌ర్మ‌ని తీవ్ర స్థాయిలో దూషించాడు. నిఖిల్ కూడా వ‌ర్మ‌పై ప‌రోక్షంగా మండిప‌డ్డాడు. ఇక‌ తాజాగా మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు లుక్ పోస్ట్ చేసి ”కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను’ అని కామెంట్ పెట్టాడు. వ‌ర్మ వ్యాఖ్య‌ల విష‌యంలోనే చ‌ర‌ణ్ ఈ కామెంట్ చేశాడ‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. కాగా, రేపు ఉద‌యం 11 గంట‌ల‌కి ప‌వ‌ర్ స్టార్ సినిమాని త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేటర్లో విడుదల చేయబోతున్నాడు.

Tags :
|

Advertisement