Advertisement

  • నేను కూడా నెపోటిజం బాధితుడినే ..సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

నేను కూడా నెపోటిజం బాధితుడినే ..సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Fri, 03 July 2020 12:38 PM

నేను కూడా నెపోటిజం బాధితుడినే ..సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు



బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ అకస్మాత్తుగా మరణంతో బాలీవుడ్ లో దాగి ఉన్న నెపోటిజం ఒక్కసారిగా బయటపడింది ..ఎంతో కెరీర్ , మంచి హిట్లు , కావాల్సినంత డబ్బు ఉన్న కూడా సుశాంత్ సూసైడ్ చేసుకోవడంతో నెపోటిజం మీద అనేక మంది తీవ్ర వాఖ్యలకు చేసారు .. బాలీవుడ్‌లో ఉన్న వారసత్వ రాజకీయాలపై చర్చ మరింత వేడిని పుట్టిస్తున్న క్రమంలో తాజాగా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్‌ మాట్లాడుతూ.. తాను కూడా నెపోటిజమ్‌ బాధితుడని పేర్కొన్నాడు. భారత దేశంలో ఉన్న అసమానత్వాన్ని బయట పెట్టాల్సి అవసరం వచ్చింది. నెపోటిజం, అభిమానవాదం రెండు వేరువేరు విషయాలు. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా బంధుప్రీతి సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రస్తుతం దీనిపై సినిమా పరిశ్రమ నుంచి అనేక మంది చర్చకు రావడం సంతోషంగా ఉంది. అంటూ పేర్కొన్నాడు. అంతేగాక తన కూతురు సారా అలీ ఖాన్ మొదటి చిత్రం కూడా సుశాంత్ సింగ్‌తో ‘కేదార్‌నాథ్’ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

అయితే సైఫ్ అలీ ఖాన్ నెపోటిజం బారిన పడ్డ అన్నవాఖ్యలపై నెటిజెన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది ..అలనాటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కొడుకుగా.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌటీ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఒక సంస్థానానికి మహారాజు. ఈ క్రమంలో హీరో పటౌడీ వంశాన్ని, వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్‌లో వ్యంగ్యంగా మీమ్స్‌ రూపొందిస్తున్నారు.

Tags :
|

Advertisement