Advertisement

  • నేను సినిమా స్టార్ కొడుకును కాదు..విద్యుత్ జమాల్

నేను సినిమా స్టార్ కొడుకును కాదు..విద్యుత్ జమాల్

By: chandrasekar Sat, 25 July 2020 08:39 AM

నేను సినిమా స్టార్ కొడుకును కాదు..విద్యుత్ జమాల్

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. నెపోటిజం అనేది చాలాసార్లు గమనించామంటూ కొందరు స్టార్లతో పాటు యంగ్ నటీనటులు సైతం నోరు విప్పారు. నటుడు విద్యుత్ జమాల్‌కు సైతం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరని, అయినా స్వశక్తితో ఎదిగాడని మంచి పేరుంది. మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన జమాల్ పలు దేశాల్లో ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.

తన లేటెస్ట్ మూవీ ‘యారా’ గురించి నటుడు విద్యుత్ జమాల్ ఐఏఎన్‌ఎస్ మీడియాతో ముచ్చటించాడు. ‘నేను సినిమా స్టార్ కొడుకును కాదు. కానీ స్నేహితుల వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. అయితే నాకు ఇండస్ట్రీలో స్నేహితులు లేరని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గాడ్ ఫాదర్, పెద్దల అండ లేకున్నా ఈరోజు నేనిలా ఉన్నానంటే అందుకు కారణంగా బాలీవుడ్‌లో నేను కొందరితో స్నేహం చేయడం, స్నేహితులు తగిన సహకారం అందించారు. తన సహనటులు అమిత్ సాధ్, కెన్నీ బసుమత్రి, విజయ్ వర్మ నా స్నేహితులు.

వీరి పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా లేటెస్ట్ సినిమా యారా చూస్తే మీకు ఇదే ఫీలింగ్ తప్పక కలుగుతుంది. డెహ్రాడూన్‌లో షూటింగ్ సమయంలో నువ్వు స్టార్ అవుతావని విజయ్‌తో చెబితే నవ్వాడు. కానీ తర్వాత తనకు అవకాశాలు రావడంతో సంతోషించాను. ఇది మా ఫ్రెండ్ షిప్. నార్త్ ఇండియాలోనే షూటింగ్ చేశాం. యారా సినిమ ముఖ్యంగా భారత్, నేపాల్ బోర్డర్ సరిహద్దు ప్రాంతాల కథాంశంగా తెరకెక్కించారు. ఫ్రెండ్‌షిప్ గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమాను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రోజు జులై 30న జీ5లో విడుదల చేస్తున్నామని’ నటుడు విద్యుత్ జమాల్ వివరించాడు.

Tags :
|

Advertisement