Advertisement

  • నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి ..బస్తి మే సవాల్ ..ఆర్జీవీ

నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి ..బస్తి మే సవాల్ ..ఆర్జీవీ

By: Sankar Wed, 22 July 2020 5:24 PM

నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి ..బస్తి మే సవాల్ ..ఆర్జీవీ



సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాతో మరో సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనికి కౌంటర్‌గా రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయినా సమస్యేమీ లేదని, తానెప్పుడూ బెదిరింపుల మధ్యే జీవించానని పేర్కొన్నారు. తన స్టార్‌ పవర్‌ స్టార్‌ కన్నా పవర్‌ఫుల్‌గా ఉందని, బస్తీమే సవాల్‌ అంటూ సవాలు విసిరారు. కాగా, పవర్‌ స్టార్‌ సినిమా జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నారు ఆర్జీవీ.

అయితే వివాదాలతో సహజీవనం చేసే వర్మ ఏది చేసిన అందులో సంచలనమో , లేదా వివాదమో ఉండేలా చూసుకుంటాడు ..ఇటీవల కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించి అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా పడినప్పటికీ వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తన ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు ..ఇంతవరకు బానే ఉంది గాని , ఎవరి గురించి సినిమా తీయడం లేదు అని చెబుతూనే పవన్ కళ్యాణ్ గురించి సెటైరికల్ మూవీ అయినా పవర్ స్టార్ ను తీస్తుండటం వల్లనే వర్మకు ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ..

Tags :
|
|

Advertisement