Advertisement

ఎఫ్3 సినిమా కోసం భారీగా రెమ్యున‌రేష‌న్‌?

By: chandrasekar Wed, 02 Dec 2020 09:40 AM

ఎఫ్3 సినిమా కోసం భారీగా రెమ్యున‌రేష‌న్‌?


వెంక‌టేశ్‌ మరియు వ‌రుణ్ తేజ్ కాంబినేషన్ లో సూపర్ హిట్ కామెడీ సినిమా ఎఫ్2 విజయం సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మరియు అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో ఎఫ్2 చిత్రం వచ్చింది. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా విడుద‌లై దిల్ రాజుకు కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే ఎఫ్2కు బ‌డ్జెట్ త‌క్కువ‌వ‌డం, క‌లెక్ష‌న్లు ఎక్కువ‌గా రావ‌డంతో బాగా లాభాలు వచ్చాయి. కానీ దీనికి సీక్వెల్ ఎఫ్3 విష‌యంలో రివ‌ర్స్ అయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఈ చిత్రం కోసం వెంకీకి రూ.6 కోట్లు, వ‌రుణ్ కు రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన దిల్ రాజు ఇపుడు మాత్రం భారీగానే ముట్ట‌జెప్పుతున్నాడ‌ట‌.

ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం కానున్న ఎఫ్3 కోసం వెంక‌టేశ్ కు రూ.10 కోట్లు ఇస్తుండ‌గా వ‌రుణ్ తేజ్ కూడా అంతే స‌మానంగా డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్‌. మ‌రోవైపు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ సారి త‌న రేంజ్ పెంచుకుని వారితో స‌మానంగా రూ.10 కోట్లు పారితోషికం ఇవ్వాల‌ని అడిగార‌ట‌. త్వ‌ర‌లో షూటింగ్ కావాల్సి ఉండ‌టంతో ఇక చేసేదేమి లేక దిల్ రాజు ఈ ముగ్గురి కోసం రూ.30 కోట్లు వెచ్చించిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. కరోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ తో సినిమా చేస్తే ఎంత‌వ‌ర‌కు క‌లెక్ష‌న్లు వ‌స్తాయో వేచి చూడాలి. ఎఫ్2 సినిమా భారీగా విజయం సాధించడం వల్ల ఇప్పుడు ఎఫ్3 కి క్రెజ్ పెరిగి ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Tags :
|
|

Advertisement