Advertisement

‘హిట్‌' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌

By: chandrasekar Thu, 16 July 2020 6:43 PM

‘హిట్‌' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌


విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా హీరో నాని నిర్మాణంలో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘హిట్‌' చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడు శైలేష్‌ కొలను ప్రశంసలు అందుకున్నారు.

ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతున్నది. ఇందులో రాజ్‌కుమార్‌రావ్‌ హీరోగా నటించనున్నారు. కుల్‌దీప్‌ రాథోడ్‌తో కలిసి నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను పునర్నిర్మించబోతున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన శేలైష్‌ కొలను హిందీ రీమేక్‌ నిర్దేశకబాధ్యతల్ని స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 2021లో సెట్స్‌పైకి రానున్నది. దర్శకుడు శైలేష్‌ కొలను మాట్లాడుతూ ‘రాజ్‌కుమార్‌రావ్‌, దిల్‌రాజులతో కలిసి పనిచేయనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం ఉత్తరాదివారిని అలరిస్తుందనే నమ్మకముంది. గతం, వర్తమానానికి మధ్య సంఘర్షణకు లోనయ్యే పాత్రకు పరిణితిని కనబరిచే నటుడు అయితేనే న్యాయం చేయగలడని ఆలోచిస్తున్న తరుణంలో రాజ్‌కుమార్‌రావ్‌ ఈ సినిమాను అంగీకరించడం సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌ నేటివిటీ, ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా కథలో మార్పులు చేయనున్నాం’ అని తెలిపారు.

రాజ్‌కుమార్‌రావ్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుత సమాజానికి ఉపయుక్తమైన చిత్రమిది. సినిమా చూడగానే కనెక్ట్‌ అయిపోయాను’ అని పేర్కొన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు.

Tags :
|
|
|

Advertisement