Advertisement

  • రామ్ గోపాల్ వర్మ కు హై కోర్ట్ షోకాజ్ నోటీసులు జారీ

రామ్ గోపాల్ వర్మ కు హై కోర్ట్ షోకాజ్ నోటీసులు జారీ

By: Sankar Tue, 24 Nov 2020 5:32 PM

రామ్ గోపాల్ వర్మ కు హై కోర్ట్ షోకాజ్ నోటీసులు జారీ


దిశ ఎన్కౌంటర్ చిత్రంపై రాంగోపాల్ వర్మకు షోకాజు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది కృష్ణామూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి, వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారన్నారు కృష్ణ మూర్తి. ఈ చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు కృష్ణ మూర్తి తెలిపాడు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరాడు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న ఎలా చిత్రం తీస్తారని కోర్టుకు కృష్ణమూర్తి తెలిపాడు.

వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ క్రమములో సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ షోకాజు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Tags :
|
|

Advertisement