Advertisement

  • ఓటిటిలో మరొక స్టార్ హీరోయిన్ సినిమా విడుదలకు సిద్ధం

ఓటిటిలో మరొక స్టార్ హీరోయిన్ సినిమా విడుదలకు సిద్ధం

By: Sankar Thu, 25 June 2020 12:38 PM

ఓటిటిలో మరొక స్టార్ హీరోయిన్ సినిమా విడుదలకు సిద్ధం



కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు అన్ని మూతపడి దాదాపుగా మూడు నెలలు అవుతుంది ..దీనితో చిత్ర నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ..ఇదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫారం బాగా అభివృద్ధి చెందింది ..ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఇప్పుడు అరచేతిలోనే అన్ని కనిపిస్తున్నాయి ..ప్రేక్షకులు కూడా లాక్ డౌన్ ఎత్తివేసి థియేటర్లు ఓపెన్ చేసిన ఇంతకుముందు లాగ వెళ్లే సాహసం చేయలేకపోవచ్చు ..దీనితో నిర్మాతలు డిజిటల్ పద్దతిలోనే సినిమాలను విడుదల చేయాలనీ చూస్తున్నారు .

అమెజాన్ , నెట్ ఫ్లిక్ , హాట్ స్టార్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నాయి ..దీనితో వీటిల్లో ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తికబరుస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక హీరోయిన్‌‌గా నటించిన ‘పొన్‌మగల్‌ వందాళ్‌’, కీర్తి సురేష్‌ నటించిన ‘పెంగ్విన్‌’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడిదే కోవలో ప్రముఖ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘డేనీ’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేపడుతున్నారు.

డేనీ చిత్రంలో వరలక్ష్మితో పాటు యోగిబాబు, షియాజీషిండే, వేల్‌ రామమూర్తి తదితరులు నటించారు. సంతోష్‌ దయానిధి సంగీతం సమకూర్చారు. పీజీ ముత్తయ్య నిర్మించిన ఈ చిత్రానికి సంతానమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ‌లో విడుదల చేసేందుకు తమిళ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement