Advertisement

  • నెపోటిజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సమీరా రెడ్డి

నెపోటిజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సమీరా రెడ్డి

By: Sankar Sun, 06 Sept 2020 06:21 AM

నెపోటిజమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సమీరా రెడ్డి


సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే లేపింది..ఎంతో కెరీర్ ఉన్న ఒక యువ నటుడు ఇలా అర్దాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు..చాల మంది నేపోటిజమ్ కారణంగానే సుశాంత్ మరణించాడని అన్నారు..కంగనా వంటి వారు నేపోటిజమ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే..దీనితో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది..

ఇక నెపోటిజం తోపాటు మరో వైపు డ్రగ్స్ వాడకం కూడా బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఇక నెపోటిజం పై ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా హీరోయిన్ సమీరా రెడ్డి నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించినప్పుడు... షూటింగ్ మధ్యలో ముద్దు సన్నివేశం గురించి చెప్పారని తెలిపింది. స్క్రిప్ట్ చెప్పినప్పుడు దీని గురించి చెప్పలేదుకదా అని తాను ప్రశ్నించగా... సినిమా నుంచి నిన్ను తప్పించడం పెద్ద విషయం కాదని దురుసుగా సమాధానమిచ్చారని చెప్పారని సమీర అంది.

స్టార్ కిడ్స్ ను ప్రోత్సహించేందుకు తనకు రావాల్సిన మూడు సినిమాలు రాకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా నీతో కలిసి నటించడం చాలా బోరింగ్ అని ఓ హీరో డైరెక్ట్ గానే చెప్పేశాడని.. ఆ తర్వాత ఏ సినిమాలో తనను తీసుకోలేదని సమీర తెలిపింది.

Tags :

Advertisement