Advertisement

  • తెలుగులో పవన్ కళ్యాణ్ ..బాలీవుడ్ లో అజయ్ దేవగన్ అంటే చాల ఇష్టం ..హీరోయిన్ ప్రణీత

తెలుగులో పవన్ కళ్యాణ్ ..బాలీవుడ్ లో అజయ్ దేవగన్ అంటే చాల ఇష్టం ..హీరోయిన్ ప్రణీత

By: Sankar Sun, 05 July 2020 9:11 PM

తెలుగులో పవన్ కళ్యాణ్ ..బాలీవుడ్ లో అజయ్ దేవగన్ అంటే చాల ఇష్టం ..హీరోయిన్ ప్రణీత



అత్తారింటికి దారేది సినిమాలో ఆమ్మో బాపుగారి బొమ్మో అనే పాట ఉంటుంది ..ఆ పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆడిపాడిన హీరోయిన్ ప్రణీత ..పాటలో చెప్పినట్లే నిజంగానే బాపు గారి బొమ్మలాగే ఉంటుంది ప్రణీత ..ఎం పిల్లో ఎం పిల్లాడో సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత ..ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘బావ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ప్రణీత పాపులర్ అయ్యింది. అయితే, ఈ సినిమా తరవాత ప్రణీత నటించిన ఏ చిత్రం పెద్దగా ఆడలేదు..

ఇదిలా ఉంటే, ఆదివారం సాయంత్రం ప్రణీత ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. వాళ్లతో ముచ్చటించింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ తన అభిమాన నటుడు అని ప్రణీత చెప్పింది. అలాగే, టాలీవుడ్‌లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది. మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమంటే ‘హ్యాండ్‌సమ్’ అని బదులిచ్చింది. ఇంకా ప్రణీతను ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి..

ఇక క్రికెటర్ ధోని గురించి అడిగితే అయన ఒక లివింగ్ లెజెండ్ ..నా ఫేవరేట్ ఆటగాడు ..వచ్చే టి ట్వంటీ ప్రపంచ కప్ లో ఆడాలని కోరుకుంటున్నాను అని అన్నారు ..ఇక 24 సినిమాలో ఉన్నట్లు సమయాన్ని వెనక్కి తిప్పే వాచ్ ఉంటె చైనా వెళ్లి వాళ్ళను పూర్తిగా శాకాహారులుగా మారుస్తానని అన్నారు ..ఇక తెలుగు వంటకాలలో పెసరట్టు అంటే చాలా ఇష్టం అని అన్నారు ..




Tags :

Advertisement