Advertisement

  • బిగ్ బాస్ షోలో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్

బిగ్ బాస్ షోలో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్

By: Sankar Wed, 22 July 2020 10:36 AM

బిగ్ బాస్ షోలో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన తరుణ్



బిగ్ బాస్ సీజన్లో మొదలవుతుంది అంటే వెంటనే అభిమానుల్లో ఉత్కంఠ మొదలవుతుంది ..ఎవరు హోస్ట్ చేస్తారు , కంటెస్టెంట్స్ ఎవరు అని ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతాయి ..అయితే ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లను అద్భుతంగా నడిచాయి ..దీనితో నాలుగో సీజన్ మీద ఆసక్తి మొదలయింది..అయితే నాలుగో సీజన్ కరోనా కారణంగా ఆలస్యంగా మొదలవుతుంది ..

తాజాగా హీరో తరుణ్‌ కూడా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాను బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై తరుణ్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బిగ్‌బాస్‌లో పాల్గొంటానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. ఫేక్‌ న్యూస్‌ నమ్మవద్దని.. అలాగే ప్రచారం కూడా చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు..

అందరికీ నమస్కారం. ఈ కష్ట సమయంలో మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. సోషల్‌ మీడియాలో, కొన్ని న్యూస్‌ పేపర్లలో నేను బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలు. నేను ఆ షోలో పాల్గొనడం లేదు.. అలాగే పాల్గొనాలనే ఆసక్తి కూడా నాకు లేదు. ఇవన్నీ కేవలం రుమార్లు. దయచేసి ఫేక్‌ న్యూస్‌ నమ్మకండి.. అలాగే వ్యాప్తి చేయకండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీ అందరి ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు’ అని తరుణ్‌ పేర్కొన్నారు. కాగా, గత ఏడాది కూడా తరుణ్‌ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..

Tags :
|

Advertisement