Advertisement

  • 'V' సినిమా పై సంచలనమైన కామెంట్స్ చేసిన హీరో సుధీర్ బాబు

'V' సినిమా పై సంచలనమైన కామెంట్స్ చేసిన హీరో సుధీర్ బాబు

By: Anji Fri, 18 Sept 2020 3:17 PM

'V' సినిమా పై సంచలనమైన కామెంట్స్ చేసిన హీరో సుధీర్ బాబు

నాని ప్రయోగం గా చేసిన 'వి' సినిమా ప్రయోగాత్మకంగా OTT లో రిలీజ్ అయ్యి వసూళ్లను అయితే సాధించింది. కానీ ఈ సినిమాలో ఏదైతే హైలైట్ అనుకున్నారో అదే పెద్ద మైనస్ గా మారిపోయింది. మొదటి నుంచి నాని, సుదీర్ బాబుల కాంబో పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక వెరైటీ సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా మంచి అభిరుచి గల దర్శకుడు అని పేరుంది.. ఈ నేపథ్యంలో సినిమా పై నాని ఫాన్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు.. అనూహ్యంగా సినిమా దియేటర్లో రిలీజ్ కాకపోవడం తో ప్రేక్షకులు అక్కడే సగం నిరాశచెందారు. సినిమా కూడా కొంత అటుఇటుగా ఉండడంతో సినిమా మొత్తానికే దెబ్బ పడిందని సినిమా వర్గాలు వెల్లడిస్తున్నాయి.. సినిమా చూసిన తర్వాత 'V' మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని కామెంట్స్ చేశారు.


అంతే కాకుండా నాని కెరీర్ లో మైలురాయి లాంటి సిల్వర్ జూబ్లీ చిత్రానికి ఇలాంటి నేపథ్యాన్ని ఎలా ఎంచుకున్నాడని.. సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు స్క్రిప్ట్ పై వర్క్ చేయలేదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమా కి బ్యాడ్ నేమ్ రావడానికి కారణాలు చెప్తూ హీరో సుధీర్ బాబు ఓ ట్వీట్ చేశారు. రీడింగ్ అవర్స్ అంటూ సుధీర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఇంద్రగంటి మోహనకృష్ణ - నాని - సుధీర్ బాబు - నివేదా థామస్ - సీనియర్ నరేష్ - రోహిణి కనిపిస్తున్నారు. అయితే నేరేషన్ దశలో ఈ సినిమా స్టొరీ ఎంతో అద్భుతంగా కనిపించిందని ఇప్పుడు రిజల్ట్ ఇలా రావడం పట్ల తాను కూడా ఆశ్చర్య పోయానని అన్నట్లు అయన చెప్తున్నారు.


నిజానికి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా నాని - సుధీర్ బాబు - సినిమాటోగ్రాఫర్ కి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సుధీర్ ఈ సినిమాకి బాగా కష్టపడ్డాడని మూవీలో అతన్ని చూస్తే అర్థం అవుతుంది. కానీ ఎంత కష్టపడినా ఒక్కోసారి లానే అవుతుంది.. తాను ఒకటి తలిస్తే ఇంకొకటి అవుతుంది అనుకోని సరిపెట్టుకోవడమే అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు

Tags :
|

Advertisement