Advertisement

  • ‘ఆకాశవాణి’ ఈ మోషన్ పోస్టర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన హీరో రానా ద‌గ్గుబాటి

‘ఆకాశవాణి’ ఈ మోషన్ పోస్టర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన హీరో రానా ద‌గ్గుబాటి

By: chandrasekar Mon, 03 Aug 2020 09:51 AM

‘ఆకాశవాణి’ ఈ మోషన్ పోస్టర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన హీరో రానా ద‌గ్గుబాటి


ఒకప్పటి ప్రముఖ వినోద సాధనం ఆకాశవాణి. దేనిని గుర్తుచేస్తూ ఆ పేరుతో ఒక సినిమాని నిర్మిస్తున్నారు. 'ఆకాశవాణి' పేరుతో ఆ నాటి రోజులను, ఆ సంబరాలను గుర్తుచేసేలా కొత్త సినిమా రూపొందుతోంది. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనంగా ఉన్న 'ఆకాశవాణి' ఇప్పుడు వెండితెరపై దర్శనమివ్వబోతోంది. ప్రముఖ దర్శకుడు బాహుబలి హిట్టర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లేటెస్టుగా 'ఆకాశవాణి' మూవీ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హీరో రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ‘ఆకాశవాణి’ యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ చిత్రం కోసం అద్భుత‌మైన టీమ్ ప‌ని చేసింద‌ని ఆయన పేర్కొన్నారు. కేవలం ఓ చెట్టు, దానికి వేలాడదీసిన రేడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఈ మోషన్ పోస్టర్ కట్ చేసి ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ లుక్, మోషన్ పోస్టర్ చూస్తుంటే టాలీవుడ్ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.

అప్పట్లో రేడియో ద్వారా పొందిన ఆనందం ప‌ల్లెటూరికి, ఆకాశ‌వాణికి ఉన్న లింక్ చూపిస్తూ ఈ మూవీ రూపొందించారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాయగా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా అలనాటి వినోద వివరాలను ఇప్పటి జనరేషన్ కు వివరిస్తుంది ఏమో చూడాలి మరి.

Tags :
|

Advertisement